![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ లోకి ఈ కొత్త సీజన్ లో అసలు ఎవరెవరు వెళ్తారు అనే విషయం మీద పెద్ద చర్చే జరుగుతోంది. బిగ్ బాస్ ని ఎవరు ఎంత మంది తిట్టుకున్నా ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళ సంఖ్య మాత్రం సీజన్, సీజన్ కి పెరుగుతూనే ఉంది. అందులో ఈ సీజన్ లో ఏవో కొత్త మార్పులు అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటే ఆడియన్స్ లో ఊహాగానాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఎవరెవరు వెళ్తారో ఊహించి చెప్తూ సోషల్ మీడియాలో వాళ్ళను ఫుల్ వైరల్ చేసి పారేస్తున్నారు. అందులో భాగంగా కార్తీక దీపం మోనిత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారనే విషయం బయటకు వచ్చింది.
కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా పాపులరైన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో అలరించే అవకాశం ఉందనే విషయం తెలుస్తోంది. అయితే.. బిగ్ బాస్ సీజన్ 7 కోసం శోభా శెట్టి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఈ లేడీ విలన్ వారం రోజులకు గాను లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అయితే.. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆమెకు ఆడియన్స్ లో మంచి డిమాండ్ ఉండడంతో.. ఆమె షోకి వస్తే సందడి కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందన్న ఉద్దేశంతో ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఐతే గనక ఈ బిగ్ బాస్ సీజన్ 7 హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ లో శోభాశెట్టి ఒకరిగా ఉండబోతోంది. బిగ్ బాస్ సీజన్ 6 బిగ్ డిజాస్టర్ కావడంతో సీజన్ 7 ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ మంచి కసరత్తు చేస్తోందనే విషయం తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసే ఈ షోను ఈసారి జూలై నెలాఖరుకు కానీ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |